కాంగ్రెస్ 6 పథకాల మాట దేవుడెరుగు…కానీ 6 నెలలకు ఒక సీఎం మరుతాడు… మంత్రి హరీశ్ రావు..

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బార్డర్ బార్డర్‌ వరకు రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా కాంగ్రస్ పై సీరియస్ అయ్యారు మంత్రి హరీష్ రావు. ‘గతంలో ఇక్కడ ధాన్యం కొనకపోతే బీదర్ పోయి అమ్ముకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ధాన్యం అమ్ముకుంటున్నారు. త్వరలో కాళేశ్వరం నీళ్లు నారాయణఖేడ్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ వాళ్లు 6 గ్యారెంటీ స్కీములు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో వాళ్ల పాలన ఎలా ఉందో చుస్తే తెలుస్తుంది. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్లు ఎంతకైనా దిగజరుతారు. కాంగ్రెస్ వి అన్ని బోగస్ మాటలు..వాళ్ళని నమ్ముకుంటే మన బతుకు ఆగమే.

ఇక ఎలాగో తెలంగాణలో అధికారంలోకి రామని చెప్పి లేని పోనీ మాటలు చెబుతున్నారు. కాంగ్రెస్ 6 పథకాల మాట దేవుడెరుగు…కానీ 6 నెలలకు ఒక సీఎం మరుతాడు. కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కర్ఫ్యూ వస్తుంది. తుమ్మాలన్న, దగ్గలన్నా కాంగ్రెస్ వాళ్లు హై కమాండ్ పర్మిషన్ తీసుకోవాలి. మోడీ అవకాశం వస్తే తెలంగాణ పై విషం చిమ్ముతారు. తెలంగాణ-ఎపి విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని మోడీ చెప్పారు. మోడీ కడుపులో ఉన్న విషాన్ని బయటికి కక్కుతున్నారు. మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు. బిజెపివి అన్ని అబద్ధాలే. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా..మాపై విష ప్రచారాలు మానుకోవాలి’ అని అన్నారు మంత్రి హరీష్ రావు.