చండూరులో నిర్వహించిన సభతో భాజపా నాయకులకు కంటి మీద కునుకులేకుండా పోయింది..మంత్రి హరీశ్‌రావు….

చండూరులో నిర్వహించిన సభతో భాజపా నాయకులకు కంటి మీద కునుకులేకుండా పోయిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘‘కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌వి నకిలీ మాటలు, వెకిలి చేష్టలు. వీళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడరు. వీరి స్థాయేంటో దిల్లీ దూతలే చెప్పారు. దిల్లీలోనో, గల్లీలోనో మాట్లాడితే కాదు.. ప్రజల వద్దకు వెళ్లి అడగండి. వివిధ రాష్ట్రాల్లో భాజపా దొడ్డిదారిన ప్రభుత్వాలను పడగొట్టింది. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని వైకాపా ఇచ్చిన ఫిర్యాదు ఎందుకు పెండింగ్‌లో ఉంది?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.