దళిత బంధు పథకం కొసం నిధులు కేంద్రం నుండి ఇప్పించండి.. మంత్రి హరీష్ రావు..

దళితులపై కపట ప్రేమను ఒలకబోస్తుంది బీజేపీ. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో దళిత బంధు పథకం ను ప్రవేశ పెట్టి నిధులు ఇవ్వండి. వచ్చే బడ్జెట్ లో దళిత బంధు పథకంకు 25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. తెలంగాణ దళితుల మీద తెలంగాణ బీజేపీ నాయకులకు ప్రేమ ఉంటే కేంద్రం నుంచి దళిత బంధు పథకం కు నిధులు ఇప్పించండి అంటూ కేంద్రంపై మండిపడ్డారు మంత్రి తన్నీరు హరీష్ రావు. మిషన్ భగీరథను హర్ ఘర్ హల్ గా కాపీ కొట్టారని, రైతు బంధు లాంటి పథకంను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో తెచ్చారని విమర్శించారు. దళిత బంధు పథకంను దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు…తెలంగాణ పథకాల లాగే దళిత బంధు పథకంను కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా దళితులకు ఆర్థిక ప్రయోజనం కల్పించండి. దళితుల పేదరికాన్ని పోగెట్టేలా దళిత బంధు పథకం ను అమలు చేయండి. మార్చి 31వ తేదీలోపు రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాలకు దళితబంధు గ్రౌండింగ్ చేస్తాం. రాష్ట్రంలో మంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటే తెలంగాణ బీజేపీ వికట ఆనందం పొందుతోంది. రాష్ట్రంలో 2 ఏళ్లు ఎలాంటి ఎన్నికలు లేవన్నారు మంత్రి హరీష్ రావు. మేనిఫెస్టోలో లేకున్నా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేసుకొస్తోందన్నారు. విపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు…