నిరుద్యోగుల‌కు మంత్రి హరీష్‌రావు శుభ‌వార్త చెప్పారు….వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకీ నోటిఫికేష‌న్…

95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే ద‌క్కేలా రిజర్వేష‌న్లు...

నిరుద్యోగుల‌కు మంత్రి హరీష్‌రావు శుభ‌వార్త చెప్పారు. మ‌రో వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకీ నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని, ఉద్యోగార్థులంద‌రూ ఇందుకు సిద్ధంగా ఉండాల‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులో పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను మంత్రి హ‌రీశ్ ప్రారంభించారు..
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నున్న 80 వేల ఉద్యోగాల్లో 20 వేల ఖాళీలు పోలీస్ శాఖ‌లోనే ఉన్నాయ‌ని,
మ‌రో వారం రోజుల్లో వీటి భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్నారు. అందుక‌నే ఉద్యోగార్థులంద‌రూ స‌మ‌యాన్ని వృధా చేయ‌కుండా చ‌దువుకొని, అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. దేశంలో పోలీస్ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించిన.. ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే ద‌క్కేలా రిజర్వేష‌న్లు క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను అన్నింటినీ భ‌ర్తీ చేస్తున్నామ‌ని, మ‌రీ కేంద్ర ప్ర‌భుత్వంలో 15ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీగా ఉన్న‌ ఉద్యోగాల‌ను ఎప్పుడు భ‌ర్తీ చేస్తారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ చెప్పాలన్నారు. ధ‌ర‌లు పెంచ‌డం, ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోవ‌డం, ప్ర‌జ‌ల జీవితాన్ని ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా..? అని ప్ర‌శ్నించారు. కులాల పేరుతో చిచ్చు పెట్టి బీజేపీ ల‌బ్ధిపొందాల‌ని చూస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.