*నల్లగొండ జిల్లా కేంద్రం
రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..మంత్రి జగదీష్ రెడ్డి..

క్షమాపణలు ఎవరు ఎవరికీ చెప్పాలి.
క్షమాపణలు చెప్పాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి..అదీ లక్ష సార్లు
క్షమాపణలే కాదు ఇక్కడి నుండి ఢిల్లీ దాకా ముక్కలు నేలకు రాయాలి
క్షమాపణ డిమాండ్ చేసే వారికి సిగ్గుండాలి
అసలు క్షమాపణలు ఎందుకు చెప్పాలి
తెలంగాణా ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నా
వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూన్నందుకా
రికార్దు స్థాయిలో ధాన్యం ఉత్పత్తులు చేస్తున్నందుకా
రైతుబందు,రైతుభీమా పెట్టినందుకా
సంక్షేమాన్ని… అభివృద్ధిని ఏక కాలంలో పరుగులు పెట్టిస్తున్నందుకా
తెలంగాణాకు పోవాలి అంటే పాస్ పోర్టులు వీసాలు కావాలి అన్నోడికి వంగి దండం పెట్టిన మీది కాదా
తెలంగాణా ఏర్పాటుకు అడగడుగునా అడ్డుపడిన వై ఎస్ ,చంద్రబాబు లతో దోస్తీ కట్టింది మీరు కాదా
అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు గల్లీ నుండి ఢిల్లీ వరకు ముక్కు నేలకు రాయాలి..
లక్ష సార్లు క్షమాపణ చెప్పాలి..
మంత్రి జగదీష్ రెడ్డి
*క్షమాపణలు ఎందుకు చెప్పాలి.
నిజంగా క్షమాపణలు చెప్పాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీయే చెప్పాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్బోధించారు.
క్షమాపణలే కాదు ఇక్కడి నుండి ఢిల్లీ దాకా ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు…..క్షమాపణలు కుడా ఒక్కసారి కాదని లక్ష సార్లు క్షమాపణలు, వెయ్యి సార్లు గల్లీ నుండి ఢిల్లీ వరకు 50 వేల సార్లు ముక్కు నేలకు రాసుకుంటూ పోతే తప్ప ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏడూ దశాబ్దాలుగా చేసిన పాపానికి విముక్తి కలుగుతుందని ఆయన ఎద్దేవాచేశారు. క్షమాపణలు ఎందుకు చెప్పాలి.వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నందుకా,వరుసగా 16 పంటలకు సాగు Salt T97అందించినందుకా8,ఉమ్మడి నల్లగొండ జిల్లా ను ఫ్లోరోసిస్ నుండి విముక్తి చేసి మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీరు అందించి దాహార్తి ని తీర్చినందుకా ఎందుకు క్షమాపణలు చెప్పాలో చెప్పాలని ఆయన నిలదీశారు.హైదరాబాద్ కు పోవాలి అంటే పాస్ పోర్టులు కావాలి..వీసాలు కావాలి అన్నోడికి వంగి వంగి దండాలు పెట్టి పదవుల కోసం పెదవులు మూసుకుని సాగర్ ఎడమ కాలువా రైతాంగాన్ని వంచనకు గురి చేసింది మీరు,మీ బాస్ రాజశేఖర్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడిన రాజశేఖర్ రెడ్డి 2014 మీరు పొత్తు పెట్టుకున్న చంద్రబాబులే కదా కృష్ణా జలాల దోపిడీకి పాల్పడ్డది. అటువంటి జలదోపిడి గాళ్ల జలదోపిడిని నిలువరించ లేక పోయినందుకు మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది మేము కాదని ఆయన స్పష్టం చేశారు. అసలు క్షమాపణ పదం ఉచ్చరించేందుకే కాంగ్రెస్ నాయకులు సిగ్గు పడాలని ఆయాన అన్నారు.మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా ఓ కుగ్రామంలో పుట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ కబళించింది అని ఆయన నిలదీశారు.మీ నిర్వాకంతోటే కదా రెండు లక్షల పై చిలుకు జనానికి నడ్డి విరిగి ఎముకలు గుళ్ల అయింది నిజం కాదా అని కాంగ్రెస్ నేతలపై విరుచుకు పడ్డారు. అటువంటి నిర్వాకం నుండి మునుగోడు తో సహా ఉమ్మడి నల్లగొండ జిల్లాను బయట పడేసి సురక్షిత నీరు తాపిస్తున్నందుకా క్షమాపణలు అంటూ ఆయన దుయ్యబట్టారు.టెల్ ఎండ్ పేరుతో సాగర్ ఎడమ కలువా మొదటి తూము రాజవరం మొదటి మేజర్ ను 55 ఏండ్లుగా ఎండపెట్టిన పాపం కాంగ్రెస్ పార్టీది కాదా…40 ఏళ్లుగా జిల్లాను శాసించిన మీది కాదా ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.పర్యావరణం అనుమతులు, పై ప్రాంతంలో పులులు భయపడతాయంటూ కాకమ్మ కబుర్లతో కాలయాపన చేసింది చాలక సొరంగం అంటూ సోది ముచ్చట్లు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నాయకులను చూస్తుంటే “నవ్వి పొదురు గాక నాకెటి సిగ్గు” అన్న చందంగా కనిపిస్తుందన్నారు.ఆ మాట కొస్తే కాంగ్రెస్ పార్టీలో పాద యాత్రలు నాయకుల ఉనికిని చాటు కోవడానికే నని అందులో భాగమే భట్టి పాదయాత్రగా ఆయన అభివర్ణించారు. పార్టీలో పట్టు కోసం పాదయాత్రలలో ఒకరితో ఒకరు పోటీ పడి పార్టీలో పట్టు కోసం పరుగు పందెం పెట్టుకున్నట్లు కనిపిస్తుంది మినహా ఎక్కడా ప్రజల కోసం ఆ యాత్ర సాగియినట్లు కనిపించడంలేదన్నారు.ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడైనా సాగర్ ఎడమ కాలువ కింది భూములకు వరుసగా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన చరిత్ర ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆంద్రా బాస్ లకు ఢిల్లీ పెద్దలకు దడుసుకుని లాగులు తడుపుకునే తెలంగాణా కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు కోరే ముందు గురివింద సామెత గుర్తుకు తెచ్చుకోవలన్నారు.24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కు మేము నాటిన మొక్కలే అంటూ బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులు మీ ఎలుబడిలోరాజస్థాన్,ఛత్తీస్ ఘడ్ లలో ఎందుకు మొలకెత్తలేదని ఆయన ఎద్దేవాచేశారు.అదే 2014 కు పూర్వం ఉమ్మడి జిల్లాలో సాగులో ఉన్న భూమి ఎంత…2014 తరువాత సాగులోకి వచ్చేంది ఎంత… అప్పటి దిగుబడి ఎంత ఇప్పుడు దిగుబడి ఎంత అన్నది లెక్కలు తెలీకుండా మాట్లాడుతున్న మీ తెలివి తక్కువ తనాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 40 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో రికార్డ్ సృష్టించిన విషయం నిజం కాదా అని ఆయన కాంగ్రెస్ నేతల మీద ఫైర్ అయ్యారు. వరసగా 16 పంటలకు నీళ్లు యిచ్చి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని అటువంటి మహానేత ముందు వంగబడి 1000 సార్లు ముక్కు నేలకు రాస్తే తప్ప మీరు చేసిన పాపం నుండి విముక్తి కాజలరన్నారు.అంతెందుకు 2014 కు పూర్వం ఏనాడైనా లాఠీ చార్జీలు లేకుండా విత్తనాలు,ఎరువులు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ రికార్డ్ లో ఉందా అని ఆయన పేర్కొన్నారు.వేసవికాలంలో నీటి దాహార్తిని తీర్చాలి అంటూ అడపడచులు రోడ్డెక్కి హాహాకారాలు చేసిన రోజులు ఒక్కసారి యాది చేసుకోవాలని ఆయన కాంగ్రెస్ నేతలకు ఉపదేశించారు. అటువంటి పార్టీ ,ఆ పార్టీ నాయకులు పార్టీలో ఉనికి కోసం పాదయాత్రలు,పరుగు పందేలు పెట్టుకుంటే తప్పు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి అంటేనే ప్రజల పక్షాన ఆ పార్టీని నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఉద్యోగ నియామకాల గురించి మాట్లాడే నైతికతే కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నారు.2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎలుబడిలో ఉన్న కాంగ్రెస్ వచ్చిన ఉద్యోగాలు వచ్చినట్లు ఆంద్రా పాలకులకు వయపడి ఆంద్రా వారిని నియమించి తెలంగాణాలో నిరుద్యోగాన్ని పెంచి పోషించారని ఆయన ఫైర్ అయ్యారు. మీరే ఉద్యగ నియామకాలు ఎప్పటికప్పుడు చేపడితే రాష్ట్ర విభజన నాటికి అన్ని ఖాళీలు ఎందుకు ఉన్నాయో సమాదనం చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.అదే తెలంగాణా ఏర్పడ్డాకా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన లక్షా 35 వేల ఉద్యోగ నియమాకాలలో పూర్తిగా తెలంగాణా బిడ్డలే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే దరణిని రద్దు చేస్తాం..యాదాద్రి పవర్ ప్లాంట్ ను బ్లాస్ట్ చేస్తానన్నందుకే కాబోలు ఈ నాయకులను,ఆ పార్టీని ప్రజలు పూర్తిగా నిరుద్యోగులుగా మార్చారని మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతల పై వ్యంగాస్త్రాలు విసిరారు….. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి రవీందర్ నాయక్ పాల్గొన్నారు..