హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా కేసీఆర్…మంత్రి జగదీష్ రెడ్డి..

హైదరాబాద్

హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా కేసీఆర్..రాష్ట్రానికి బిఆర్యస్ శరణ్యం..మంత్రి జగదీష్ రెడ్డి(mantri Jagadish Reddy)..
హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా కేసీఆర్ రికార్డ్ సృష్టించ బోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

తొంబయి ఏళ్లలో సాదించని అభివృద్ధి తొమ్మిదేళ్లలో సాదించినందుకు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులై తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా బి ఆర్ ఎస్ పార్టీలో చేరుకున్నట్లుగా తెలిపారు..

బుధవారం ఉదయం ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని రామన్నగూడెం మాజీ సర్పంచ్ రాసకొండ శ్రీరాములు,రాసకొండ సతీష్, రాసకొండ నగేష్, ఉప్పలయ్య,సైదులు తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబి కండువాలు కప్పి పార్టిలోకి అహ్హనించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రనికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు.