ఢిల్లీకి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది….మంత్రి జగదీశ్వర్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా..*

నేరేడుచర్ల లో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి,. ..

హుజూర్ నగర్ టౌన్ హాల్ లో అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఊచిత కోచింగ్ సెంటర్ లో యువతీ యువకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నరు.. మంత్రి జగదీష్ రెడ్డి… జిల్లా జడ్పీ చైర్మన్ దీపిక యుగంధర్..
స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి….
తర్వాత హుజూర్ నగర్ మండలం అమరవరం లో బడిబాట లో భాగంగా సుమారు 30 లక్షల వ్యయంతో అదనపు తరగతి గది శంకుస్థాపన చేసి,, పల్లె ప్రగతి ఇ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…

ఢిల్లీకి కేసీఆర్ భయం పట్టుకుంది

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వరంగల్ డిక్లరేషన్ వర్తించదా

కాంగ్రెస్ నేతలు కల్లు తాగిన కోతుల్లా ఎగురుతున్నారు…

మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరు..

కాంగ్రెస్ పాలనలో జెనరేటర్ల మీదనే వ్యవసాయం…

అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటేనే తెలంగాణా

ఇష్టం లేకున్నా ఒప్పుకోక తప్పనిసరి అయింది

అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా..

60 ఏండ్ల పాలనకు అమరవరం అభివృద్ధి సరిపోతుంది

రైతుబంధు పేరుతో సంవత్సరానికి3,225 మందికి 3.25 కోట్లు

నాలుగు ఏండ్లుగా రైతులకు చేరింది 10 కోట్లు

రైతుభీమా పధకం కింద 34 మంది రైతులకు కోటి 70 లక్షలు

ఐదు కోట్లరైతు రుణమాఫీ

కళ్యాణాలక్షి/షాధిముభారక్ పధకం కింద 200 మంది లబ్దిదారులకు రెండు కోట్లు

కేసీఆర్ కిట్ కింద 200 మంది లబ్ధిదారులకు 12000 చొప్పున

నెలవారిగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి 3.45 లక్షలు

అంకెలలో అక్షరం తప్పున్నా దేనికైనా సిద్ధం..

_*-కాంగ్రెస్ నేతలకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్*

హుజుర్నగర్ నియోజకవర్గంలో పట్టణ ప్రగతి,పల్లెప్రగతి

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి

పాల్గొన్న జడ్ పి చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తదితరులు….

నెరేడుచర్ల పురపాలక సంఘంలో క్రీడాప్రాంగణం ప్రారంభం

అమరవరం లో సి సి రోడ్లు,ప్రాథమిక పాఠశాలకు శంకుస్థాపన….
ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయం పట్టుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణా ను దాటుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే దేశం చూస్తుందని అందుకే ఢిల్లీని ఏలుతున్న పాలకులు హడలిపోతున్నారని ఆయన చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో మోసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ ఎలుబడిలో ఉన్న రాష్ట్రాలకు అదే డిక్లరేషన్ వర్తింప చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. నాల్గవ విడత పట్టణ ప్రగతి,ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి హుజుర్నగర్ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.స్థానిక శాసనసభ్యులు శానంపుడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి నెరేడుచర్ల పురపాలక సంఘం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిడా ప్రాంగణాన్ని ప్రారంభించి యువతతో కొద్దిసేపు వాలీబాల్ ఆడి వారిని ఉత్తేజపరిచారు. అదే విదంగా హుజుర్నగర్ మండలం అమరవరం గ్రామపంచాయతీ పరిధిలో ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన తోపాటు సి సి రోడ్లకు ఆయన శంఖుస్థాపన జరిపారు.శ్రీనివాసపురం, లింగగిరిలలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అంతకు ముందు అమరవరంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇష్టం ఉన్నా లేకున్నా అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం అంటేనే తెలంగాణా అని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు.60 ఏండ్ల కాంగ్రెస్ పాలనను ఒక్క అమరవరం గ్రామపంచాయతి లో జరిగిన అభివృద్ధి ముందు పెడితే వారి పాలన ఎంతటి దిగదుడుపు అన్నది ఇట్టే తెలిపోతున్నదన్నారు.ఒక్క అమరవరం గ్రామంలోనే 3225 మంది రైతాంగానికి రైతుబంధు పథకం కింద సంవత్సరానికి మూడు కోట్ల 25 లక్షలు పెట్టుబడి సాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది, టి ఆర్ యస్ ప్రభుత్వానిదన్నారు.రైతుబంధు పథకం కింద ఒక్క ఈ గ్రామానికే పధకం ప్రారంభించిన నాలుగు ఏండ్లలో 10 కోట్ల రూపాయలు అందించమన్నారు.అదే విదంగా రైతు భీమా పధకం కింద ఇదే గ్రామానికి చెందిన 34 మంది రైతులకు కోటి 70 లక్షల భిమాను అందించిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన కొనియాడారు.ఆసరా ఫించన్ ల లెక్కలను లబ్ధిదారులే కాంగ్రెస్ పార్టీకీ కనువిప్పు కిలిగించేలా చెచెప్పండన్నారు.
మిషన్ కాకతీయ పధకం కింద కోటి 20 లక్షలు,ఇంటింటికి మంచినీరు అందించే మిషన్ భగీరథ పధకం కింద కోటి 40 లక్షలు ఖర్చుపెట్టిన కెసిఆర్ ప్రభుత్వం కళ్యాణాలక్షి/షాధిముభారక్ పథకాల కింద 200 మంది లబ్దిదారులకు రెండు కోట్లు,కేసీఆర్ కిట్ కింద పురుడు పోసుకున్న వారికి ఆడపిల్ల పుడితే 13000,మగపిల్లాడు జన్మిస్తే 12000 చొప్పున 200 మందికి అందించామన్నారు.అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 60 ఏండ్లలో ఇక్కడి రైతాంగానికి 25 లక్షలు మంజూరు చేశారా అని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.అటువంటి నాయకులు మీ మీ గ్రామాలకు వస్తే ఈ లెక్కలు అడగండి గట్టిగా నిలదీయండి.2014 కు ముందు ఎందుకు రావడం లేదు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించండి.లెక్కల్లో అక్షరం తప్పున్నా దేనికి అంటే దానికి సిద్ధమన్నారు.కాదని రుజువు చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు.24 గంటల నిరంతర విద్యుత్ తో ప్రశాంతంగా నిద్రపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు గుర్తుకు రాగానే నిద్రలో సైతం ఉలిక్కి పడుతున్నారని ఆయన ఎద్దేవాచేశారు. అందుకు అమరవరం గ్రామంతో సరిసమానంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టడమే కారణమన్నారు.యింకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,స్థానిక శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి, జడ్ పి టి సి సైదిరెడ్డి, యం పి పి గుడెపు శ్రీనివాస్,సర్పంచ్ సుజాత అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.