బండి సంజయ్ కి మతి భ్రమించింది… మంత్రి జగదీష్ రెడ్డి..

నల్లగొండ జిల్లా కేంద్రం లొ

నల్లగొండ పట్టణాభివృద్ధిలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మర్రిగూడ జంక్షన్, నల్గొండకు ఐకాన్ గా నిలిచిన క్లాక్ టవర్ జంక్షన్ లతో పాటు పట్టణంలో రెండు బస్తి దవాఖానలకు ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి లతో కలసి ప్రారంభించారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ బిజెపి పై నిప్పులు చెరిగారు. బిజెపి నేత బండి సంజయ్ కి మతి భ్రమించిందని, దేశానికి బిజెపి ప్రమాదకారి అని,మునుగోడు లో ఎగిరేది గులాబీ జెండాయే నని, అక్కడ బిజెపి కి మూడో స్థానమే నని, ఇప్పటికైనా వామపక్షాలు టి ఆర్ యస్ తో కలసి రావాలని బిజెపి ని నిలువరించే శక్తి సామర్ధ్యాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.

*మునుగోడు లో ఎగిరేది గులాబీ జెండానే*

*టి ఆర్ యస్ విజయం ఎప్పుడో ఖాయం*

*బిజెపి కి మునుగోడు లో మూడో స్థానమే*

*మోడీ ఇచ్చిన అక్రమ సంపాదనతో కోట్లు కుమ్మరించి గెలవాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడు..*

*మునుగోడు ఉప ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ చరిత్ర సమాప్తం…*

*వామపక్షాలు టి ఆర్ యస్ తో జతకట్టాలి*

*బిజెపి తో దేశానికి పెను ప్రమాదం*

*ఈ డి,సి బి ఐ లు టి ఆర్ యస్ ను లొంగ తీసుకోలేవు*

*గులాబీ సైన్యం నిప్పు లాంటిది*

*ముట్టుకుంటే మాడి మసై పోతారు*

*బెదిరింపులకు బెదిరి పోయేది కాదు కేసీఆర్ సైన్యం*

*బిజెపి ని నిలువరించ గల శక్తి సామర్ధ్యాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కున్నాయి*

*ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి కాదు ఒక ప్రభలమైన శక్తి*

*అటువంటి బిజెపి ని తరిమికొట్టెందుకు వామపక్షాలు మాతో కలవాలి*

*బండి సంజయ్ కి మతి భ్రమించింది*

*ఆయన పదవి కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చో పెట్టిన చందంగా ఉంది*