బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి కొండా సురేఖ విమర్శలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. కవిత మద్యం కేసులో ఇరుక్కుని బీజేపీ నేతలను కాళ్ళు మొక్కి తప్పించుకున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం దెయ్యాలు వల్లించినట్టుందన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ మహానగరం అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మీడియాతో ముచ్చటించిన కొండా సురేఖ బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టువస్త్రాలను అందించారని ప్రశ్నించారు. ఆ డబ్బు కేసీఆర్ సొంత డబ్బేనా? ప్రజల సొమ్మును దోచుకున్న బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌ కోసం మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి కొండా సురేఖ..లిక్కర్ రాణిగా పేరొందిన కవిత.. బీజేపీ నేత కాళ్లు మొక్కిందని కవితను ఎంపీగా ఎక్కడనుంచి పోటీచేసిన ప్రజలు ఆమెను ఓడించి ఇంటికి పంపిస్తారు. కవిత మాటలు వేదాలు దెయ్యాలు వల్లించినట్టు ఉన్నాయని కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. ఫూలే గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందని కొండా సురేఖ అన్నారు. పదేళ్లు పాలించినప్పుడు ఫూలే గుర్తు రాలేదా? మంత్రి కొండా సురేఖ గతంలో బిఆర్‌ఎస్ నాయకుల దృష్టి అభివృద్ధి కంటే భూసేకరణపైనే ఉందని పేర్కొన్నారు..