మంత్రి మ‌ల్లారెడ్డిపై దాడికి ప్ర‌య‌త్నించిన‌వారిపై ఘ‌ట్‌కేస‌ర్‌ పోలీసులు కేసు న‌మోదు…

మంత్రి మ‌ల్లారెడ్డిపై దాడికి ప్ర‌య‌త్నించిన‌వారిపై ఘ‌ట్‌కేస‌ర్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌ల్లారెడ్డిపై దాడికి య‌త్నించిన‌వారిని గుర్తించి, కేసు న‌మోదు చేయాల‌ని టీఆర్ఎస్ నాయ‌కులు ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో సోమ‌వారం ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా సోమ‌శేఖ‌ర్‌రెడ్డి, హ‌రివ‌ర్ధ‌న్‌రెడ్డిల‌ను ప్ర‌ధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.
వీరిపై 341, 352, 504, 506, 147, 144 ఐపీసీ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ ఇద్ద‌రితోపాటు మ‌రికొంత‌మంది కూడా ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే వారిని గుర్తించి, కేసులు న‌మోదు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు.