మంత్రి రోజుకి పెరుగుతున్న మద్దతు…రోజాకు మద్దతుగా మరో సీనియర్ హీరోయిన్లు….

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి… మంత్రి రోజాపై అవాకులూ చెవాకులూ పేలిన సంగతి తెలిసిందే. రాయడానికి వీలులేని మాటలు మాట్లాడారు బండారు. దీంతో యావత్ మహిళా లోకం దుమ్మెత్తి పోసిందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో రోజాకు రోజు రోజుకీ ఇండస్ట్రీ జనాల నుంచి మద్దతు పెరుగుగుతుంది. దీంతో టీడీపీకి ఇదో కొత్త సమస్యలా మారేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును… మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత, నిస్సిగ్గు వ్యాఖ్యల వ్యవహారం పొలిటికల్ హాట్ టాపిక్ గానే ఉంది. ఆ కేసులో బండారుని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ పై బయటకు రావడం అంతా చకచకా జరిగిపోయినప్పటికీ… ఆ వ్యాఖ్యల తాలూపూ సామాజిక ప్రతిస్పందనలు మాత్రం రోజు రోజుకీ పెరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా… సినీ ఇండస్ట్రీ నుంచి మంత్రి రోజాకి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది…తాజాగా రమ్యకృష్ణ, మీనా కూడా బండారు వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళా ఆర్టిస్ట్ లు బండారు సత్యనారాయణను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. బండారుకి తల్లి, చెల్లి, భార్య లేరా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి కుటుంబ సభ్యులైనా బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో రోజాకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో టీడీపీ నేతలు సైలంట్ అయిపోయారు. నిన్నమొన్నటి వరకూ వెనకా ముందూ చూడకుండా సంస్కారం మరిచిన కొంతమంది నేతలు బండ్దారును సమర్ధించారు. ఆయన అరెస్టును ఖండించారు. ఇంతకంటే నీతిమాలిన చర్య మరొకటి ఉంటుందా అనే కామెట్లు వినిపించిన అనంతరం వారంతా సైలంట్ అయిపోయారు.సీనియర్ ఆర్టిస్టులు అంతా కలిసి బండారుకు దిమ్మతిరిగించేలా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో ఉన్న కాస్త గౌరవం అయినా కాపాడుకోవాలనుకుంటే… వెంటనే రోజాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఫలితంగా ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అయ్యే అవకాశం ఉందని… లేదంటే మరింత ముదిరి పాకనపడే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో బండారు… రోజాకు క్షమాపణలు చెప్పి వ్యవహారాన్ని చక్కబరుస్తారా.. లేక, తాను మునుగుతూ పార్టీ పుట్టే కూడా ముంచుతారా అనేది వేచి చూడాలి!