మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్య..!

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్య.

శ్రీనగర్ కాలనీ మణికంఠ హోటల్లో సూసైడ్.

నుదుటిపై పాయింట్ బ్లాక్ గన్. షూట్ చేసుకుని ఆత్మహత్య.

ఘటన జరిగిన స్థలంలో పరిశీలిస్తున్న సబితా ఇంద్రారెడ్డి , వెస్ట్ జోన్ డిసిపి..

శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లోన్ రికవరీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం కూతురితో కలిసి డ్యూటీకి వచ్చిన ఫజన్ అలీ.. తన కూతురు కళ్ల ముందే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..