రాకేశ్‌ మరణం ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే..మంత్రి సత్యవతి రాథోడ్….

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన ఆందోళనలో వరంగల్‌ జిల్లా యువకుడు రాకేష్‌ మృతిని నిరసిస్తూ చేపట్టిన భారీ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.బిజేపి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు..

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు మంత్రి సత్యవతి రాథోద్.

రాకేశ్‌ మరణం ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని మండి పడ్డారు.

వరంగల్ ఎంజీఎం నుండి దబీర్‌పేట వరకు నిర్వహించిన అంతిమయాత్ర ర్యాలీలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి. ఇతర ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..