*బ్రేకింగ్ న్యూస్….*
మహబూబ్ నగర్ టూటౌన్ కు చేరుకున్న నాంపల్లి కోర్టు సమన్లు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడివిటి అంశం పై పదకొండు మందిపై క్రిమినల్ కేసులు నమెూదు చేయాలంటు ఆదేశం, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం దగ్గర ఉత్కంట నేలకొంది…
అంతకుముందు తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నాంపల్లి కోర్టు షాక్కిచింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎలక్షన్ అఫిడవిట్ ట్యాంపరింగ్ వివాదంపై తీర్పు ఇచ్చిన కోర్టు… మంత్రిపై ట్యాంపరింగ్ కేసు పెట్టాలని ఆదేశించింది. మంత్రితో పాటు ఐఏఎస్ అధికారులపై కేసులు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర, కేంద్ర రిట్నరింగ్ ఆఫీసర్లపై కూడా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ అవాస్తవమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేయించారని… దీనివెనుక మాజీ మంత్రి, మాజీ ఎంపీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించారు.