అనుకోకుండా కోపంలో జరిగిన ఘటన క్షమించండి.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

ఇటీవల భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు జాదవ్‌ను నెట్టివేసిన ఘటన పై క్షమాపణలు చెబుతూ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్..

ఆరోజు అనుకోకుండా షూతో నా కాలు తొక్కడంతో ఒకసారిగా బొటనవేలు నుండి రక్తం రావడం జరిగిందని దాంతో ఎదురు ఎవరున్నారో కూడా చూసుకోకుండా ఆవేశంగా కొంత నెట్టడం జరిగిందని ఆరోజు పబ్లిక్ కూడా చాలా ఎక్కువ మందిని ఉండడం కూడా ఎవరు ఏమిటి అనేది కూడా నేను చూడలేదని అన్నారు… తనమీద కావాలనే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముందల ఉన్న పబ్లిక్ని చూపించకుండా కేవలం తాను తోసి చేసుకున్న దాన్ని పదేపదే చూపిస్తూ తనపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు..

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరిజన బిడ్డను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు..

అంతకుముందు చైర్మన్ చంపచెల్లుమనిపించిన వీడియో వైరల్ కావడంతో మంత్రి తలసానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి…

బీఆర్‌ఎస్‌ మంత్రులు, స్థానిక నేతలతో పాటు బైంసా అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జాదవ్‌ రాజేష్‌ కూడా వచ్చారు. కేటీఆర్‌ పక్కనే నడుస్తూ వెళ్తున్న రాజేష్‌ను ఒక్కసారిగా తలసాని వెనక్కి లాగారు. కాలర్‌ పట్టుకుని చెంపమీద కొట్టారు. ఒక పదవిలో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది..మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బైంస మార్కెట్‌ కమిటీ చైర్మన్‌తో ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…