నగరంలో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas Yadav) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మృగశిర 9వ తేదీన వస్తుందని.. ఆరోజు ఉదయం నుంచే చేప ప్రసాదం ప్రారంభం అవుతుందని తెలిపారు. బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తోందని… చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాధిగా వస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హరినాథ్ గౌడ్ (harinaad goud) కుటుంబం ఈ చేప ప్రసాదాన్ని వేస్తున్నారని అన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వారి సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 స్టాల్ లు ఏర్పాటు చేశామని.. సీసీ కెమెరాలు, ఫైర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 250 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వాలంటీర్‌లు పని చేస్తున్నారన్నారు. 3 సంవత్సరాలుగా కరోనాతో ఈ కార్యక్రమం జరగలేదన్నారు. చేప ప్రసాదంతో పాటు ఇంటికి తీసుకెళ్లాడానికి కార్తీ కౌంటర్లు కూడా పెంచినట్లు చెప్పారు. గోషామహల్ ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(mantri Srinivas Yadav) పేర్కొన్నారు…………
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.