మంత్రి తలసాని శ్రీనివాస్‌కు నిరసన సెగ…

ఉమెన్స్‌ డే సందర్భంగా రాష్ట్రమంతా మహిళాబంధు వేడుకలు నిర్వహిస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు హాజరయ్యారు..మంత్రి తలసాని శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. మంత్రి సభలో ప్రసంగిస్తుండగా జీహెచ్ఎంసీ మహిళా కార్మికుల ఆందోళనకు దిగారు.. మంత్రి మాట్లాడుతుండగానే తమ డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు మహిళా కార్మికులు. జీతాలు పెంచాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలన్నారు. ఎన్నిసార్లు అడిగినా మాట దాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జీతాలు పెంచాలని, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని సార్లు అడిగిన మాట దాటేస్తున్నారని దీంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. కార్మికులు ఆందోళన సద్దమణిగిన తర్వాత తలసాని ప్రసంగించారు. కరోనా వేళ జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు మరువలేనివని కొనియాడారు. మహిళా కార్మికులకు రూ.12 వేల జీతం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని తలసాని శ్రీనివాస్ హామీ ఇచ్చారు..