రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా* ….

హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామ స్వామి గుట్ట సమీపంలో రూ. 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్స్ పునరుద్దరణ పనుల శంఖుస్థాపన, పైలాన్ ప్రారంభించిన తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్ది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లడుతూ….

రెండు వేల ఒక వంద అరవై ఇళ్లను 73కోట్లతో పునరుద్దరణ పనులు చేపడుతున్నాం. వాటిని పూర్తి చేసి హుజుర్నగర్ లో పేదవారు అయినా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వారి కలలు మేము నిజం చేస్తాం.

మాజీ సీఎం కేసిఆర్ కావాలనే ఇళ్లను పూర్తి కాకుండా చేశారు.

ఉచిత బస్, 500గ్యాస్,200యూనిట్ కరెంట్ ఉచితం ఇచ్చి వందరోజులలో అద్భుత పాలన అందిస్తున్నాం.

ప్రతీ నియోజకవ్గస్థాయిలో ప్రతీ సంత్సవరంలో 3500 ఇంటి నిర్మాణానికి 5లక్షలు ఇస్తాము…

రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయి.

హుజూర్ నగర్ లో నీతివంతమైన పాలన అందిస్తాం.

ఎవ్వరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదు.

లిఫ్ట్ అన్నీ నేను తెచ్చిన,
అన్నీ లిఫ్ట్ లు పనిచేసేలా చూసి నీరు అందేలా చూస్తాను

విద్యా విషయంలో హుజూర్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎర్పాటు చేయబోతున్నాం.
PHC లను అప్గ్రేడ్ చేస్తున్నాం.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఇళ్ళ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేశాలా చూస్తాను.

నియోజకవర్గం మొత్తం అభివృధి చెందేలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాది.

*పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్..*

మెము పాలకులం కాదు సేవకులం.కాంగ్రెస్ పార్టీ వొచ్చిన 4 రోజుల్లోనే 73 కోట్లు మొదటగా మీ హుజుర్నగర్ కే కేటాయించటం జరిగింది.

తెలంగాణా ధనిక రాష్ట్రాన్ని , అప్పుల రాష్ట్రం చేసినా ఘనత మాజీ సీఎం కేసిఆర్ ది .

అప్పులు ఉన్నా రాష్టాన్ని అందరం కలసి బయటకి తెచ్చేలా ఎంతో కృషి చేస్తున్నాం.

తెలంగాణా రాష్ట్రంలో ప్రతి నియోజకవ్గస్థాయిలో సంవత్సరనికి 3500ఇల్లు మంజూరు చేయడం జరుగుతోంది..

గత ప్రభుత్వము 1. లక్షలు 12వేల ఇల్లు మాత్రమే ఇచ్చరు .

ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత రాష్ట్రము అభివృధి లో నడుస్తుంది.

గతంలో tspsc అంటె అందరికి తెలుసు పేపర్ లీకులుఅని.

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు.

2008డీఎస్సీ ఉద్యోగం లను త్వరలో ఉద్యోగంలో కి తీసుకోబోతున్నది.

మంచి పరిపాలన అందిచడం మే మా ధ్యేయం.
వర్షాలు లేకపోవడంతో నీటి కొరత వొచ్చింది.

కాళేశ్వరం లో చేసినా తప్పుడు విధానాలవల్ల నేడు నీరు ఉండికూడా వాడుకోలేకపో తున్నాం .

60రోజుల పసిపాప లాంటి పాలనపై ఆరోపణలు చేస్తున్నారు .

BRS చేసినా తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనించాలి.

గత పాలకుల శాపాలు ఇప్పుడు ఉపేక్షించేది లేదు.
అప్పుల్లో ఉన్నా రాష్ట్రానీ, బయట పడేసే సరిదిదటమే పనిలో పెట్టుకున్నాం.

భద్రాద్రి, యాదాద్రి పేరుతో దోచుకోవడానికి ప్రచారం లో బాగ వాడుకున్నారు.

ధరణీ లో ఎలా ల్యాండ్ మాయ చేశారో త్వరలో ప్రజల ముందుకు తీసుకొని వస్తాం.