జిల్లాలలో సరైన పద్ధతిలో నియోజకవర్గాలలో మండలాల విభజన జరగలేదు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా..*

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామం లో జిల్లా ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాల ఎర్పాటు చేసి 75వ వార్షికోత్సవ కార్యక్రమం, హుజూర్నగర్ నియోజకవర్గం లో పలు అభివృధి కార్యక్రమాల్లో పాల్గొన్నా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ

పొనుగోడు స్కూల్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా,, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడంతో అత్యంత ముఖ్యమైన పనులను కూడా పెట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది..

పొనుగోడు ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం..

జిల్లాలు, మండలలా ఏర్పాట్లపై గత ప్రభుత్వం ఇష్టరీతుగా, అస్తవ్యస్త పాలసీ అమలు చేసింది….

ప్రాథమికంగా పాటించాల్సిన పద్ధతులన్నీటిని పాటించకుండా వ్యవహరించింది…

వాటిపై ఒక కమిషన్ ఏర్పాటు చేయబోతున్నం..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి విద్య,, ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం..

గత పాలకులు ప్రభుత్వ పాఠశాలల విషయంలో, అలసత్వం వహించారు,,.

ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం దాదాపు నిరుపేదలు చదువుతున్నారు.. వీరందరికీ అన్ని విధాల అందుబాటులో ఉండేలా ప్రభుత్వ స్కూల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం..

పాఠశాలలో టాయిలెట్ రూమ్ లో ఏర్పాటుకి 10 లక్షలు,, లైబ్రరీకి మరో 10 లక్షలు… ఎస్టిమేట్ తయారు చేసి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించుకొనేలా త్వరగా తన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.. పొనుగోడు లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ని అప్డేట్ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.. జిల్లాలు , మండలాలు ఏర్పాటు పై ప్రజల అభిప్రాయాలు, తెలుసుకొని, ఓ కమీషన్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు….. కొన్ని జిల్లాలలో సరైన పద్ధతిలో నియోజకవర్గాలలో మండలాల విభజన జరగలేదు… అందుకనే ఈసారి అన్ని ఆలోచించి సరైన పద్ధతిలో ఏర్పాటు పై నిర్ణయం తీసుకోబోతున్నం…

హుజూర్ నగర్ మండలం, లింగగిరి లో 20 లక్షల తో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.

నూతన గ్రామపంచాయతీలను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది…. లింగగిరి ప్రాంతానికి రోడ్లు వేసింది ,, బ్రిడ్జిలు కట్టింది అన్నికుడా తన హయాంలో నే అన్నారు ….

గత సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల్లో కూరుకుపోయింది.. ఒక్కొక్కరి పేరు మీద
అప్పులు తెచ్చాడు … 24 గంటలు కరెంటు ఇస్తున్నాను అని ప్రచారం చేసి రైతులను మోసం చేశారు ….
70 సంవత్సరాల్లో చేయని అప్పుని 10 సంవత్సరాల్లో కెసిఆర్ చేసి చూపించారు…