మునుగోడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి….

*మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు.*

ఇన్నాళ్లు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉప ఎన్నికల్లో ఎవరిని నిలబెడుతున్నారు అనే సందేహానికి నేటితో తెరపడింది… అందరూ ఊహించిన విధంగానే
ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ, స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు..