పోలీసు క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి…

కొంత‌కాలంగా ప్ర‌శాంతంగా ఉన్న దండ‌కార‌ణ్యంలో మ‌ళ్లీ అల‌జ‌డి రేగింది...

పోలీసు క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి…
కొంత‌కాలంగా ప్ర‌శాంతంగా ఉన్న దండ‌కార‌ణ్యంలో మ‌ళ్లీ అల‌జ‌డి రేగింది…

అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు (బిజిఎల్)తో క్యాంపును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు…

మావోల దాడిలో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీసు స్టేషన్‌ పరిధిలోని ధర్బా దగ్గర పోలీసు క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలు అయ్యాయని.. వారిలో ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక, పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు జవాన్లను హెలీకాఫ్టర్ ద్వారా రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.. మరో ఇద్దరికి బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.. కుత్రు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన మావోయిస్టుల దాడిలో.. అప్రమత్తమైన పోలీసులు, జవాన్లు.. పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు…