కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రి శశిధర్…

*BREAKING..
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. చాలా బాధతో కాంగ్రెస్ను వీడుతున్నానని, పార్టీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. కాగా శశిధర్ రెడ్డి తండ్రి మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా రెండు పర్యాయాలు పనిచేశారు. అటు శశిధర్ త్వరలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.