కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలోకి..!!! అమిత్ షాతో భేటీ.!!!

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయన ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. మర్రి శశిధర్ రెడ్డితో పాటు బండి సంజయ్, డీకే అరుణ కూడా అమిత్ షాతో భేటీ ఆయ్యారు. శశిధర్ రెడ్డి పార్టీలో చేరికపై నేతలు అమిత్ షాతో చర్చించారు. అయితే హైదరాబాద్ వెళ్లి కార్యకర్తలతో మాట్లాడి మంచిరోజున పార్టీలో చేరుతానని శశిధర్ రెడ్డి అన్నట్లు సమాచారం.

జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోత్తులో భాగంగా ఆయన టిక్కెట్ కోల్పోయారు. కాగా, అమిత్ షాతో భేటీ సందర్భంగా ఎంపీ అరవింద్ నివాసంపై జరిగిన దాడి గురించి బండి సంజయ్ వివరించారు. అమిత్ షా వెంటనే ఫోన్ లో అరవింద్‌తో మాట్లాడి దాడి గురించి తెలుసుకున్నారు…