డబుల్ లేయర్ మాస్క్‌లు ఖచ్చితంగా వాడాల్సిందే హెచ్చరికలు జారీ….

కరోనా సాధారణ ప్రజల జీవితాలను అస్త్యవస్తం చేసింది. కరోనా వచ్చి ఏడాది అవుతున్నా ఈ మాయాదారి మహమ్మారి ఇప్పటికి తన రూపురేఖలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నా, బూస్టర్‌ డోసులు వేసుకున్నా ఎవ్వరేమి తక్కువ కాదు నాకు అందరూ ఒక్కటే అంటూ విరుచుకు పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్‌ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్‌ డౌన్‌ దిశగా వెళ్లాయి. మరికొన్ని దేశాలు దీన్ని ఎదుర్కొవడానికి కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఏది ఏమైనా ప్రజలు సాధారణ జీవితాన్ని ఇప్పట్లో చూడటం కష్టమనే చెప్పాలి. దీంతో మరోసారి ఈ మహమ్మారిని ఎదుర్కొవడానికి మాస్క్‌ల ఆవశ్యకతపై చర్చ మొదలైంది. ఏది మంచింది. అనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి…కోవిడ్‌ -19, ఒమిక్రాన్‌ వేరియంట్, డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్న ఈ వ్యాధుల నుంచి బయటపడేందుకు ప్రాథమిక రక్షణగా మాస్క్‌లు పనిచేస్తాయని డాక్టర్ల నమ్మకం కానీ, వీటి సామర్థ్యం పై ప్రజల్లో చాలా అను మానాలు ఉన్నాయి. ఎంతవరకు ఇవి రక్షణను ఇస్తాయనేదే ప్రశ్న. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యాధి నియంత్రణ కేంద్రాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా పలు ఆరోగ్య సంరక్షణ సంస్థలు మాస్క్‌లను ఖచ్చితంగా ధరించాల్సిందేనని ఇప్పటికే చెప్పాయి. ప్రజలు టీకాలు వేసుకున్నారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా మాస్క్‌లు వాడాల్సిందేనని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి…సింగిల్-లేయర్ క్లాత్ మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌ల నుంచి ప్రజలు డబుల్ లేయర్ మాస్క్‌లు లేదా N95 మాస్క్‌లకు అప్‌గ్రేడ్‌ కావాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థలు తరుచుగా చెబుతునే ఉన్నాయి. మాస్క్‌లతో పూర్తి రక్షణ కాకున్నా ఈ కరోనా వేరియంట్‌ను ఎదుర్కొవడంలో ప్రాథమికంగా రక్షణ కల్పిస్తాయి. అంతే కాకుండా మాస్క్‌లను సరిగ్గా ధరిస్తే అవి ప్రజలు పీల్చే గాలి నుంచి వైరస్‌ కణాలు ఫిల్టర్‌ చేయడం ద్వారా వ్యక్తులకు రక్షణను కల్పిస్తాయని ఆయా సంస్థలు పేర్కొన్నాయి…