మఠంపల్లి ఎస్.ఐ కు జరిమాన.!!
కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన మట్టంపల్లి ఎస్. ఐ బాలకృష్ణకు జరిమానా విధిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి. వి. భాస్కర్ రెడ్డి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లపుదాసు కళమ్మ కు తన వివాహ సమయంలో ఆమె పుట్టింటి నుండి పసుపు కుంకుమ కింద దానముగా ఇచ్చిన వ్యవసాయ భూమిని తన ఆడపడుచు యరగాని విజయలక్ష్మి ఆమె భర్త గురవయ్య ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించి రెవెన్యూ అధికారుల అండదండలతో తన భూమిని విజయలక్ష్మి పేరుతో మోటేషన్ చేయించుకొని పట్టాదార్ పాస్ బుక్ పొందగా ఈ విషయాన్ని తెలుసుకొని బాధితురాలు కళమ్మ మఠంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎటువంటి చర్య తీసుకోనందున సూర్యాపేట జిల్లా ఎస్పీ, కోదాడ డిఎస్పి, హుజూర్ నగర్ సి.ఐ. లకు కళమ్మ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసినది. అయినప్పటికీ వారెవరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హుజూర్ నగర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయగా న్యాయమూర్తి అట్టి కంప్లైంట్ ను మఠంపల్లి పోలీస్ స్టేషన్ కు పంపుతూ కేసు నమోదు కొరకు తగు ఆదేశములు జారీ చేసినారు. అయినప్పటికీ ఎస్.ఐ. నాలుగు నెలల సమయం గడిచినప్పటికీ కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆమె రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేయగా పూర్తి వాదనలను విన్న న్యాయమూర్తి సి.వి భాస్కర్ రెడ్డి మఠంపల్లి ఎస్. ఐ. బాలకృష్ణను తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థకు 5000 రూపాయలను చెల్లించాలంటూ తీర్పు చెప్పారు. ఆ తీర్పును అనుసరించి మఠంపల్లి ఎస్.ఐ.బాలకృష్ణ సోమవారం జరిమానా పైకం 5000 రూపాయలను చెల్లించి రసీదు పొందారు..
భూవివాదంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హుజూర్నగర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశించినా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన మఠంపల్లి ఎస్ హెచ్ ఓ.
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు.కౌంటర్ దాఖలకు హైకోర్టు ఆదేశం.
నాలుగు నెలల తర్వాత ఇటీవల FIR No:185/2023 కేసు నమోదు చేసిన మఠంపల్లి ఎస్సై.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సై కు రూ.5000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు.ఈరోజు హైకోర్టు లీగల్ సెల్ అథారిటీకి జరిమానా డబ్బులు చెల్లించిన మఠంపల్లి ఎస్సై.
పలు విభాగాల్లో రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న జిల్లా పోలీసు యంత్రాంగానికి, మఠంపల్లి పోలీస్ స్టేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన పలు కేసులు నమోదు.