మట్టికథ’కు 3 అంతర్జాతీయ అవార్టులు…

మట్టి కథ’కు(matti kadha) ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్స్ రావడంతో.. ఒక్కసారి ఈ సినిమాపై అటెన్షన్ పెరుగుతోంది. ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇటీవల ‘బలగం’ (Balagam) సినిమాకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో నటుడు ప్రియదర్శి ఎంపికయ్యాడు. ఇప్పుడు అదే కేటగిరీలో ‘మట్టి కథ’ సినిమా హీరో అజయ్ వేద్.. ఉత్తమ నటుడిగా ఎంపిక కావటం మూవీపై అంచనాలను పెంచేస్తోంది. అంతే కాదు.. ఇదే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో.. మమ్మనీతమ్ అనే తమిళ సినిమాకు(Tamil move) హీరో విజయ్ సేతుపతి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సినిమాల సరసన ఇప్పుడు మట్టి కథ చేరడంతో చిత్రయూనిట్ చాలా సంతోషంగా ఉంది..

మట్టికథ’కు 3 అంతర్జాతీయ అవార్టులు
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ(matti kadha) తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి..
ఈ మూవీ(matti katha)కి కడియాల దర్శకత్వం వహించారు. అన్నపరెడ్డి, సతీశ్ మంజీర నిర్మాతలుగా వ్యవహరించారు. జానపద గాయని కనకవ్వ, బలగం తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. స్మరన్ సాయి ఈ మూవీకి సంగీతం అందించారు. ఇటీవలె ఈ మూవీ ట్రైలర్, ఫస్ట్ లుక్‌ను రచయిత విజయేంద్ర ప్రసాద్(Writer Vijayendra Prasad) రిలీజ్ చేశారు.