ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల ..!

ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల..

అక్టోబర్ 11 నుండి 18 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు..

ప్రవేశ ప్రకటన విడుదల చేసిన కాళోజి ఆరోగ్య విశ్వా విద్యాలయం…

కాళోజి హెల్త్ యూనివర్సిటీ, వరంగల్ 10-10 -2022 : రాష్ట్రం లో వైద్య దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి 18వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు…కాళోజి హెల్త్ యూనివర్సిటీ, వరంగల్ చే జారీ చేయునైనది