మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం…..

మెదక్ జిల్లా..

నార్సింగి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామం నుండి గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లో బంధువులు చనిపోవడంతో దినకర్మ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్ కు చెందిన ఈ కుటుంబం గత కొంతకాలంగా ఆలూరు కు బతుకుదెరువు కోసం వెళ్లారు ఈరోజు ఉదయం ఆలూరు నుండి బయలుదేరి రాగా నార్సింగి శివారులో వెనుక నుండి వచ్చిన ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో తిప్పా శేఖర్ 45సం, అతని కుమారుడు యశ్వంత్ 10సం తో పాటు మరో ఇద్దరు వృద్ధ దంపతులు బల నరసయ్య 7సం, మనెమ్మ 62 సం అక్కడికక్కడే మృతి చెందగా, కవిత, అవినాష్ అనే తల్లి కొడుకులకు గాయాలు కాగా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు…