మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు..

భూపాలపల్లి జిల్లా.
కాటారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చు కున్నారు..