మహిళలకు మేడారం జాతరకు ఫ్రీ లేనట్టే..!!

తెలంగాణ యావత్తు దర్శించుకోవాలనుకునే మేడారం జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అయితే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించింది. జనవరిలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ జాతల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అదే జరిగితే నష్టం తప్పదనే భయం ప్రభుత్వంలో నెలకొన్నది. దీంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశించినట్టు తెలుస్తున్నది.