మేడారంలో పోటెత్తిన భక్తులు…

మేడారంలో పోటెత్తిన భక్తులు

మేడారంలో వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని.. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.

మేడారంలో ఈ నెల 24 నుంచి 27 వరకు ఆనవాయితీగా చిన్న జాతర జరుగనున్న విషయం తెలిసిందే.

చిన్నజాతరకు ముందే వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గద్దెలపై సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం, చీరెలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకుంటున్నారు.

జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి వనదేవతల సన్నిధికి చేరుకుంటున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ నుంచి అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలించారు