మేడిగడ్డ డ్యామ్ లా, బిఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలనుంది.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా*:- హుజూర్ నగర్ నియజకవర్గం, మట్టంపల్లి మండల కేంద్రములో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు… ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 90 కుటుంబాలు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లొ చేరిక…

*ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ*..

నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని, తాను ముందే చెప్పానన్నారు.హుజూర్ నగర్ లో ,50.000 వేల మెజారిటీతో గెలవడం ఖాయం అన్నారు..

మట్టంపల్లి మండలం లో, ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు అందరిని అభినందించారు..

రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ 70సీట్లతో అధికారం లో కి రాబోతుంది.
రాష్ట్రం లో కాంగ్రెస్ గాలి
ఈస్తుందన్నారు..

ఈమధ్య సీఎం కెసిఆర్ ,ప్రజా ఆశీర్వాద సభ లో,నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్కడ కట్టాలో, ఇప్పుడు చెప్పడం విడ్డూరమని విమర్శించారు..

కాంగ్రెస్ ప్రభుత్వం లో కట్టిన డ్యామ్ లు ఇప్పటికీ,చెక్కు చెదరలేదు.కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కొద్ది రోజులకే కూలి పోతుందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైనర్ మరియు ఇంజనీర్ కెసిఆర్.
కమిషన్ల కోసం కక్కుర్తిపడి డ్యాం నీ నాసిరకంగా నిర్మించి, లక్షల కోట్ల ప్రజా ధనాన్ని వారి జేబులలో నింపుకున్నారని విమర్శించారు

మేడిగడ్డ డ్యామ్ లా, brs ప్రభుత్వం కూలిపోతుందని విమర్శించారు..

సాగర్ జలాలు తీసుకువచ్చే సమర్థత కూడా సైదిరెడ్డికి లేదు.
ఎమ్మెల్యే సైదిరెడ్డి ల్యాండ్ కబ్జాలలో బిజీగా ఉన్నారు..లిక్కర్ మాఫియా ప్రతీ షాప్ నుండీ 4 లక్షలు వసూలు చేశాడనీ విమర్శించారు..

ఎమ్మెల్యే సైదిరెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకొని,తన స్వంత మండలం లో చాలా దౌర్జన్యాలు చేసాడన్నారు..

రైతు బంధు ఉత్తమ్ కుమార్ రెడ్డి అపామాన్నాడని,సీఎం కెసిఆర్ పచ్చి అబద్ధాలు చేబుతున్నాడని విమర్శించారు..

దళితులు కి మూడెకరాల అన్నారు…కానీ ఎమ్మెల్యే సైదిరెడ్డి మట్టంపల్లి మండలము లో 300 ఎకరాలు ఆక్రమించారు.
ఇలాంటి భూదోపిడి దారులని ఇంటికి పంపే టైం వచ్చిందన్నారు.

తాను30 సంవత్సరాలు మచ్చలేని రాజకీయలు చేశానన్నారు.

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తుందని.మాట మీద నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు..

తెలంగాణ తల్లి సోనియా గాంధీ,మహిళ కోసం 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహిళలకి ఆర్టీసి బస్సు లో, ఉచిత ప్రయాణం వంటి పథకాలు తీసుకవచ్చారని తెలిపారు..

తెలంగాణ వచ్చాక స్వంత ఇల్లు కలగా మిగిలిపోయిందని, కాంగ్రెస్ అధికాంలోకి వచ్చిన వెంటనే,ఇండ్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం
5 లక్షలు మంజూరు చేస్తామన్నారు..

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే కోరే ప్రభుత్వం అని కొనియాడారు..

తెలంగాణ తల్లి సోనియా గాంధీ,మహిళ కోసం 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహిళలకి ఆర్టీసి బస్సు లో, ఉచిత ప్రయాణం వంటి పథకాలు తీసుకవచ్చారని తెలిపారు..

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే కోరే ప్రభుత్వం అని కొనియాడారు..