మార్చి 1 న చలో మేడిగడ్డ…

*మార్చి 1 న చలో మేడిగడ్డ.

మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ త‌ల‌పెట్టిన చ‌లో మేడిగ‌డ్డ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి కోరుతూ డీజీపీ ర‌వి గుప్తాకు మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ నేతృ త్వంలోని బృందం విన‌తి ప‌త్రం అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా మేడిగ‌డ్డ‌కు వెళ్లే రూట్ మ్యాప్‌ను కూడా డీజీపీకి అంద‌జేశారు. బీఆర్ఎస్ విన‌తిప‌త్రంపై డీజీపీ సానుకూలంగా స్పందించారు.

చ‌లో మేడిగ‌డ్డ ప‌ర్య‌ట‌న‌కు త‌గిన బందోబ‌స్తు క‌ల్పిస్తామ‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు డీజీపీ ర‌వి గుప్తా తెలిపారు…