మెడికల్ షాపుల్లో అక్రమాలపై.. కంప్లైంట్కు టోల్‌ ఫ్రీ నంబర్‌…

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిషేధిత డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, మెడికల్ షాపుల్లో అక్రమాలపై ఫిర్యాదులు చేయడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను (180059 96969) ఏర్పాటు చేశామని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి సోమవారం ప్రకటించారు*

మెడికల్ షాపుల్లో అధిక ధరలు వసూలు చేయడం, కొనుగోలు చేసిన మెడిసిన్స్‌కు బిల్స్ ఇవ్వకపోవడం, నకిలీ మందులు అమ్మడం, క్వాలిటీ లేని మందులు అమ్మడం వంటి అన్ని రకాల విషయాలను టోల్ఫ్రీ నంబర్‌ ద్వారా తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు*