విజిలెన్స్ అధికారుల చేతిలోకి మేడిగడ్డ ప్రాజెక్టు రికార్డ్స్..!!?

*విజిలెన్స్ అధికారుల చేతిలోకి మేడిగడ్డ ప్రాజెక్టు రికార్డ్స్?*

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ జలసౌధలో విజిలెన్స్ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది.

మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌లోనూ అధికారులు దాడులు జరుపుతున్నారు. సాగునీటి డివిజన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తు న్నారు.

మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధిం చిన దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.మొత్తం 10 ఇంజినీరింగ్, విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయి.

కాగా, గతకొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌ నేతలు, అధికారులు కుమ్మక్కై ప్రాజెక్ట్ పేరు మీద కోట్ల రూపాయలు దండుకు న్నారని ఆరోపణలు చేశారు.

అంతేకాదు.. ప్రాజెక్ట్‌ నాణ్యతలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ప్రాజెక్ట్ కుంగిందని విమర్శ లు చేశారు. ఈ క్రమంలో సడన్‌గా అధి కారులు తనిఖీలు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం శంగా మారింది.