మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం అంటున్న కాంగ్రెస్ పార్టీ…

మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చారు. 3,200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నిర్మాణం పేరుతో వృథా చేశారని విజిలెన్స్‌ పేర్కొంది. మధ్యంతర నివేదికను రెడీ చేసినట్లు తెలిపింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ బాధ్యులేనని విజిలెన్స్‌ చెప్పింది.

కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశంలోనూ పాల్గొన్నారు…బీఆర్ఎస్ పాలనలో జరిగిన కట్టడాలు, పాడైపోయిన తీరు, ప్రజా సంపదను సరైన విధానంలో ఖర్చు చేశారా? అన్న విషయాలపై చర్చించారు. భారీ వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు ఎందుకు వస్తున్నాయని మంత్రులు ప్రశ్నించారు. దీన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు..