రేపు మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి…

మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సిఎం రేవంత్ రెడ్డి, తదితరలు కాళేశ్వరంలో పర్యటించనున్నారు.

అసెంబ్లీ ప్రారంభం కాగానే రేపు ఉదయం 9.30కి సిఎం రేవంత్‌, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూడు బస్సులలో మేడిగడ్డకు బయల్దేర నున్నారు.

ప్రజా ప్రతినిధుల బృందం రేపు మధ్యాహ్నం 3గంటలకు కాళేశ్వరం చేరుకోనున్నారు. ప్రజా ప్రతినిధులు రెండు గంటలపాటు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించను న్నారు.

రేపు సాయంత్రం 5 గంటలకు ప్రజాప్రతినిధుల బృందం తిరిగి హైదరాబాద్‌ కు రానున్నారు…