మేడిగడ్డ ప్రాజెక్టు విచారణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ.

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగిపోవడం అంశంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీ లు చేశారు.

ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్ గా స్పందించిందన్నారు. మేడి గడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేడిగడ్డ వద్ద పూర్తి సమా చారంతో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ అధికారులతో ఇచ్చింద న్నారు.

మేడిగడ్డలో జరిగిన పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యూడిషియల్ విచారణ జరుపుతామని ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు క్యాబినెట్ సమావేశంలో తీర్మాణం చేసిందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాసార న్నారు.నిన్న విజిలెన్స్ దాడులు నీటి పారుదల శాఖ కార్యాల యాలలో తనికీలతో మేడిగడ్డ పిల్లర్ల కుంగు బాటుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు.

ఇవాళ ఢిల్లీలో కేఆర్ఎంబీ కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం ఉంది. ఆ సమావేశానికి రాష్ట్రం నుంచి అధికారులు హాజరు కావాల్సి ఉంది. ఈ నేప థ్యంలో ఉదయమే విజి లెన్స్ అధికారులు జలసౌ ధలోని రెండు, నాలుగు అంతస్థుల్లో ఉన్న ఈ ఎన్సీ ఆఫీసు, అనుబంధ కార్యాల యాల్లో తనిఖీలకు ఉపక్ర మించింది. దీంతో ఈఎన్సీ మురళీధర్ రావుతోపాటు మిగతా అధికారులు ఆఫీసుల్లోనే ఉండిపోయా రు. ఈఎన్సీగా మురళీధర్ రావు టర్మ్ లోనే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం సాగింది. ఈ సమయంలో కొంత కాలం ఇరిగేషన్ కార్యదర్శి గా కొంత కాలం రజత్ కుమార్ వ్యవహరించారు. ఆయన ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆ బాధ్య తలను స్మితా సబర్వాల్ చూశారు. విజిలెన్స్ తనిఖీ ల్లో ఏం బయటపడుతుందో ననే టెన్షన్ ఇరిగేషన్ అధికా రుల్లో పట్టుకుంది.