భూమివైపు వస్తున్న తోకచుక్క ..చూడటం మిస్సైతే 50 వేల ఏళ్లు ఆగాల్సిందే!

అదో అందమైన తోకచుక్క. మెరిసే తోకను వెంటపెట్టుకొని.. చల్లని ఆకాశంలో జుయ్ మంటూ వస్తోంది. దాన్ని మామూలు కళ్లతోనే చూడొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మన ఆకాశంలో గురుగ్రహం, మార్స్, శనిగ్రహం దాదాపు రోజూ కనిపిస్తాయి. కాబట్టి వాటిని ఒక రోజు చూడకపోయినా, మరో రోజు చూడొచ్చు. కానీ త్వరలో భూమికి ద్గగరగా రాబోతున్న ఆ తోకచుక్కను చూడటం మిస్సైతే మాత్రం దాన్ని చూసేందుకు 50 వేల ఏళ్లు ఆగాల్సిందే. చిత్రంగా లేదూ.

ఆ తోకచుక్కను 2022 మార్చిలో కనిపెట్టారు. అనుకోని అతిథిలా అది భూమివైపు వస్తూ ఉంది. చాలా అందమైనది. దాని తోక మెరుస్తూ ఉంటుంది. దానికి

ప్రస్తుతం ఇది భూమికి చాలా దూరంలో ఉంది. అందువల్ల ఇప్పుడు దీన్ని టెలిస్కోప్‌తో చూసినా… అంతగా కనిపించట్లేదు. కానీ జనవరి 12న ఇది సూర్యుడికి దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న భూమికి దగ్గరగా వస్తుంది. అప్పుడు ఇది బాగా కాంతివంతంగా కనిపిస్తుంది. మామూలు కళ్లతో కూడా చూసే వీలు ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) తెలిపింది.

మన ఇళ్ల దగ్గర నుంచి ఈ తోకచుక్కను చూస్తే కనిపించదు. ఎందుకంటే మన ఇళ్ల దగ్గర లైట్ల కాంతి ఎక్కువగా ఉంటుంది. వీధి లైట్ల కాంతి కూడా ఎక్

ఈ తోక చుక్క సుమారుగా కిలోమీటర్ వ్యాసార్థంతో ఉందని తెలిసింది. దీని కంటే చిన్నగా ఉండే నియోవైజ్ అనే తోకచుక్క 2020 మార్చిలో భూమి దగ్గరకు వచ్చినప్పుడు మామూలు కళ్లకే కనిపించింది. అందువల్ల ఇది కూడా కనిపిస్తుందని నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు.

ఈ తోక చుక్క 50వేల ఏళ్ల సంవత్సరాల కిందట భూమికి దగ్గరగా వచ్చి వెళ్లింది. అప్పట్లో భూమిపై మనుషులు లేరు. కొన్ని రకాల జీవులు మాత్రం ఉన..చాలా తోకచుక్కలు ఐదారేళ్లకు ఓసారి వస్తూ ఉంటాయి. మరి ఇది ఎందుకు 50వేల ఏళ్లు తీసుకుంటుంది అనే ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు శాస్త్రవేత్తలు. ఇది పారాబొలిక్ కక్ష్యామార్గం (parabolic orbit) కలిగివుంది. అందువల్ల.. ఇది ఒక రౌండ్ పూర్తి చెయ్యడానికి 50వేల ఏళ్లు పడుతుంది. కాబట్టి దీన్ని మిస్సవకుండా చూడమంటున్నారు శాస్త్రవేత్తలు