మెగాస్టార్ చిరు ఫ్యాన్స్ లో జోష్ నింపిన ట్రైలర్..

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ ట్రైలర్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 12 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ మెగా అభిమానులకు కిక్కిస్తోంది…

రాజకీయాలనుండి దూరంగా ఉన్నాను, కానీ నా నుండి రాజకీయాలు దూరం కాలేదు అంటూ మెగాస్టార్ చిరు చెప్పిన ఓ డైలాగ్ గాడ్ ఫాదర్ పై అంచనాలు మరింతగా పెరిగేలా చేసింది. అక్టోబర్ 5 న దసరా స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో అంగరంగ వైభవంగా వేలాది మంది ఫాన్స్ మద్యలో మొదలయ్యింది. ఇదే ఈవెంట్ లో చిరు గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. మెగాస్టార్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పవర్ ఫుల్ లుక్స్ తో కనిపించగా.. నయనతార సింపుల్ లుక్స్ లో కనిపించింది. అన్నయ్య వచ్చేసాడు, అన్ని వదిలేసి ఎళ్ళిపోండి అంటూ అభిమానుల అరుపుల మధ్యన మెగాస్టార్ వైట్ అండ్ వైట్ లుక్ తో పోలీస్ లాఠీ ఛార్జ్ మధ్యన ఎంట్రీ ఇవ్వగా ఆయన వెనుక సునీల్ లాంటి నమ్మకస్తులు కనిపిస్తున్నారు. నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు అంటూ మెగాస్టార్ ఖైదీ లుక్ లో ఉండగా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

సత్యదేవ్ విలనిజం, సల్మాన్ ఖాన్ యాక్షన్, నయన్ కేరెక్టర్ అన్ని అద్భుతంగా కనిపిస్తున్నాయి. మెగాస్టార్-సల్మాన్ ఖాన్ చేసిన ఓ యాక్షన్ సీన్ చూస్తే ఫాన్స్ కి పూనకాలే. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, DOP నిరవ్ షా కెమరా అన్ని గాడ్ ఫాదర్ ని మరో లెవల్లో నిలబెట్టేవిలా ఉన్నాయి..