మెగాస్టార్‌ చిరంజీవి 154వ చిత్రం వాల్తేరు వీరయ్య టీజర్‌ రిలీజ్‌..

మెగా అభిమానులకు దీపావళి సందర్భంగా సూపర్‌ గిఫ్ట్ వచ్చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి 154వ చిత్రం నుంచి అప్‌డేట్‌ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈసారి వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన మూవీ టీజర్ ను విడుదల చేసింది. బాబీ దర్వకత్వంలో వస్తున్న ఈ మూవీలో మాస్‌ మహారాజా రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక.. చిరంజీవితో శృతిహాసన్‌ జత కడుతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు చిత్రయూనిట్‌ ప్రకటించింది..