లోక్ అదాలత్ సభ్యుల నియామకం…

లోక్ అదాలత్ సభ్యులుగా బాలకృష్ణ, నాగార్జున నియామకం.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (senior civil judge court). లో ఈనెల 10వ తేదీన జరగబోయే జాతీయ మెగాలోక్ అదాలత్(mega loka Adalat) సభ్యులను నియమిస్తూ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి జి. శ్యామ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీనియర్ న్యాయవాదులు కుక్కడపు బాలకృష్ణ,(kukkadapu Balakrishna) కమతం నాగార్జున(kamatam Nagarjuna), సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరిస్తారని ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, బ్యాంకు కేసులు,కుటుంబ వివాద కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు తో పాటు చెక్ బౌన్స్ కేసులను కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించకోవాలని కోరారు.
కేసుల రాజీకి లోక్ అదాలత్ సభ్యులు సహకరించనున్నట్లు ఈసంధర్భంగా తెలిపారు.