సంచలన విషయం వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి..

నేను కూడా క్యాన్సర్ బారిన పడ్డాను: చిరంజీవి..

సంచలన విషయం వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి
నేను కూడా క్యాన్సర్ బారిన పడ్డాను: చిరంజీవి
క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి భయపడుట లేదు..
ముందుగా క్యాన్సర్ గుర్తించి చికిత్స తీసుకున్నా..
ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడ్డానన్న చిరంజీవి
ముందుగా గుర్తిస్తే అదేమంత పెద్ద జబ్బు కాదు..ఒకవైపు చిన్న బాధ, మరో వైపు ఆనందం! ఎందుకు అంటే… అగ్ర హీరో స్వయంగా తనకు క్యాన్సర్ వచ్చిందని, ముందుగా గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. చిరుకు క్యాన్సర్ వచ్చిందని తెలిసినా, దాన్నుంచి బయట పడటంతో సంతోషం వ్యక్తం చేశారంతా! అయితే… ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ చాలా మంది ఆయనకు ఫోన్లు చేశారు. దాంతో ఆయన సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.

ముందస్తు జాగ్రత్త అవసరమని చెప్పా…
క్యాన్సర్ రాలేదు. క్యాన్సర్ కింద మారేదేమో!
”కొద్ది సేపటి క్రితం నేను ఒక క్యాన్సర్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాన్ – క్యాన్సరస్ పాలిప్స్ (non – cancerous polyps)ని డిటెక్ట్ చేసి తీసేశారని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు..