ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం..

*హైదరాబాద్..

వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు…

మీ ప్రతాపం సినీ పరిశ్రమపై కాదు.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులపై చూపండి..

ఏపీ ప్రభుత్వ తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్ర

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారు..

ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టండి..

ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టండి..

ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు..ఓ ప్రైవేట్ పార్టీలో జ‌రిగిన ఈ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎప్పుడూ ఏపీ ప్ర‌భుత్వాన్ని కానీ, సీఎం జ‌గ‌న్‌ని కానీ విమ‌ర్శించ‌ని చిరు ఈ సారి నేరుగా ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌న‌సేన‌ని స‌పోర్ట్ చేస్తూ చిరంజీవి ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వంపై, ప్ర‌భుత్వ ప‌నితీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `మీలాంటి వాళ్లు ప్ర‌త్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టుల గురించి గానీ, పేద‌వారికి క‌డుపునిండే విష‌యం గురించి గానీ, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డం గురించి ఆలోచించాలి.

మీ లాంటి పెద్ద‌వాళ్లు ఇలాంటి విష‌యాల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేస్తే అంద‌రూ మీకు త‌ల వంచి న‌మ‌స్క‌రిస్తారు. అంతేగాన పిచ్చుక‌మీద బ్ర‌హ్మాస్త్రంలాగా సినిమా ఇండ‌స్ట్రీ మీద‌ప‌డ‌తారేంటీ? ` అంటూ ఏపీ ప్ర‌భుత్వంపై చిరంజీవి సంచ‌ల‌న కామెంట్‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. చ‌,ఇరు ఈ స్థాయిలో ఏపీ ప్ర‌భుత్వంపై స్వ‌రం వినిపించ‌డం ఇదే మొద‌టి సారి కావ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చిరు చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.