త్వరలో మేజర్ సినిమా ఓటీటీ..!!..
జూలై నెల 3వ తేదీ నుంచి ఇండియాలోని నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ పైకి
మేజర్ సినిమా జూన్ 3వ తేదీన థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. అడవిశేష్ మేజర్ పాత్రలో నటించి ఎంతగానో మెప్పించాడు. ఇక ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది హిందీలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. నిర్మాతలు డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది…మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
శశి కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించగా అడవి శేష్ రైటర్ గా కూడా వర్క్ చేయడం విశేషం. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అయితే భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇటీవల కాలంలో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో ఒకటిగా మేజర్ సినిమా నిలిచింది. అయితే మేజర్ సినిమాను ఓటీటీ కూడా చూడాలి అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…ఈ సినిమాను ఓటీటీ లోకి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు కరెక్ట్ గా నెల రోజులు అయిన తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తుండటం విశేషం. జూలై నెల 3వ తేదీ నుంచి ఇండియాలోని నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతోంది.