మెట్రో స్టేషన్ పిల్లర్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువతి..

ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో గురువారం ఉదయం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ విషయం ఢిల్లీలో కలకలం రేపింది….అంతుకుముందు ఆత్మహత్య చేసుకోవద్దని ఎంతమంది చెప్పినా ఆమె వినలేదు. గోడ దిగి రావాలని పోలీసులు కోరినా ఆమె అందుకు అంగీకరించలేదు. అయితే ఈ ఘటనలో ఆ యువతిని CISF సైనికులు ప్రాణాలతో రక్షించారు…CISF జవాన్లు ఆ యువతిని మాటల్లో పెట్టి.. ఆమె దూకబోయే ముందు మెట్రో స్టేషన్ కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ముందు జాగ్రత్తగా అంబులెన్స్ ను కూడా అధికారులు పిలిపించారు.

అంతలోనే CISF సిబ్బంది ఆ యువతితో మాట్లాడుతుండగానే.. ఆమె కిందికి దూకేసింది. ఆ తర్వాత వెంటనే కింద ఉన్న రక్షణ సిబ్బంది ఆమెను కాపాడారు. ఈ ఘటనలో ఆ యువతికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…