ముంబై ఇండియన్స్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో హై డ్రామా నెలకొంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన ముంబై మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ని తన వైపు తిప్పుకుంది..కెప్టెన్ హార్దిక్ పాండ్యా కుంగ్‌ఫూ పాండ్యాగా మారి కాసేపు మెంటల్ మాస్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. ఇక మ్యాచ్ ముంబైదే అనుకున్న సమయంలో హార్దిక్ వికెట్ కోల్పోవడం.. ఆఖర్లో వరుస వికెట్లు పడటంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ నేరుగా ప్లే ఆఫ్స్‌కి వెళ్లగా.. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.
వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ఆరంభంలోనే అవుట్ కావడం.. మిడిలార్డర్ విఫలం కావడంతో కనీసం 200 కూడా చేయలేరేమో అనిపించింది. కానీ ఆఖర్లో జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ అందించిన భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే నమన్ ధీర్ (6), ర్యాన్ రికెల్టన్ (12), తిలక్ వర్మ (3) కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో పవర్ ప్లేలోనే ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది.
38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును సూర్యకుమార్ యాదవ్ – విల్ జాక్స్ కలిసి ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 38 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విల్ జాక్స్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. జాక్స్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. క్రీజులో ఉన్నంతసేపూ సిక్సర్లు, ఫోర్లతో ముంబై ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.
హార్దిక్ 15 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుటవ్వడంతో మ్యాచ్ మళ్లీ రాజస్థాన్ వైపు తిరిగింది. హార్దిక్ అవుటైన వెంటనే కార్బిన్ బాష్ కూడా వికెట్ కోల్పోయాడు. వరుస వికెట్లు పడటం ఆఖర్లో రన్‌రేట్ పెరగడంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. 18వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ మిస్ హిట్‌తో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. సూర్య 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో ముంబై ఇండియన్స్ 206 పరుగుల టార్గెట్ ముందు 175కే పరిమితమైంది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. ముంబై ఇండియన్స్ సీజన్లో పదో ఓటమిని అందుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి..
ఓటమికి కారణం ఇదే...
ముంబయి ఇండియన్స్ (MI) 30 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ ఓటమిపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు…ముఖ్యంగా పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్లే మ్యాచ్ చేజారిందని ఆయన స్పష్టం చేశాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “ఈ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మేము బౌలింగ్‌లో మరో 10-15 పరుగులు అదనంగా ఇచ్చేసామని భావిస్తున్నాను. అయినప్పటికీ 206 పరుగుల లక్ష్యం ఈ వికెట్‌పై ఛేదించదగినదే. కానీ, మా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే పవర్‌ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం మా కొంపముంచింది. అక్కడి నుంచి మ్యాచ్‌ను తిరిగి మా వైపు తిప్పడం ఎప్పుడూ కష్టంతో కూడుకున్న పనే. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు పిచ్ చాలా బాగుంది, బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తోంది. సరైన షాట్లు ఆడి క్రీజులో నిలబడి ఉంటే బాగుండేది” అని తెలిపాడు.
డెత్ ఓవర్ల బౌలింగ్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. “చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే. అయితే చివరి 5 ఓవర్లలో 1 లేదా 2 బౌండరీలను ఆపగలిగితే ప్రత్యర్థి స్కోరును కట్టడి చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మేము ఆ పని చేయలేకపోయాము. రాజస్థాన్ జట్టు చివరి 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు రాబట్టడం మా ఓటమికి ప్రధాన కారణం” అని పాండ్యా వివరించాడు. ఈ సీజన్ మాకు అస్సలు కలిసి రాలేదు.. వచ్చే ఏడాది చూసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (0), నమన్ ధీర్ (6) రూపంలో పవర్‌ప్లేలోనే ఆర్చర్ ముంబయికి కోలుకోలేని దెబ్బకొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (60) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, హార్దిక్ పాండ్యా (34) అవుట్ కావడంతో ముంబయి ఇన్నింగ్స్ 175 పరుగులకే పరిమితమైంది. ఒత్తిడిని తట్టుకోవడంలో ముంబయి ఆటగాళ్లు విఫలమయ్యారని క్రికెట్ నిపుణులు విమర్శిస్తున్నారు..
మా గెలుపుకు కారణం ఇదే..
మ్యాచ్ విజయం అనంతరం రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ జోఫ్రా ఆర్చర్‌పై ప్రశంసలు కురిపించాడు. తమ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో జోఫ్రా ఆర్చర్‌దే కీలకపాత్ర అని, అతడు ఆడకపోయుంటే ఇవాళ ఇంటికి వెళ్లిపోయేవాళ్లమని పరాగ్ పేర్కొన్నాడు.
రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘మేము అనుకున్న ప్రణాళికలు సఫలం కావడం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్చరు నంబర్ 7 స్థానంలో ప్రమోట్ చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. క్రీజులో ఎవరో ఒకరు చొరవ తీసుకుని వేగంగా ఆడాల్సిన పిచ్ ఇది.
ఆ బాధ్యతను ఆర్చర్ చక్కగా నిర్వర్తించాడు. ఈ సీజన్లో నేను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నప్పుడు, అతడిని అవుట్ చేయగల సత్తా ఒక్క జోఫ్రా ఆర్చర్‌కే ఉందని నేను బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని ఆర్చర్ నిలబెట్టుకున్నాడు. అతడు బండరాయిలా దృఢంగా నిలబడి మ్యాచ్‌ను మా వైపు తిప్పాడు’ అని కొనియాడాడు.
ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఆర్చర్ @ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ స్పందిస్తూ.. ‘ఇది నా అత్యుత్తమ ప్రదర్శన అని నేను అనుకోవడం లేదు, దీనికంటే మెరుగ్గా బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సరైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయడానికే ప్రయత్నించాను.
నేను ఇంత త్వరగా బ్యాటింగ్‌కు రావాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంపాక్ట్ సబ్ నిబంధన వల్ల నాకు సాధారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. కోచ్ నన్ను ప్యాడ్లు కట్టుకోమన్నప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ, నేను నన్ను ఒక ఆల్‌రౌండర్‌గానే భావిస్తాను. ప్రస్తుతం నా ఫిట్నెస్ చాలా బాగుంది’ అని సంతోషం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితమైంది. ముంబైపై విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, కేకేఆర్‌లు కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.