మిగ్‌ విమాన ప్రమాదంలో పైలట్‌ మృతి….

మిగ్‌ విమాన ప్రమాదంలో పైలట్‌ మృతి

కుప్పకూలిన మిగ్‌ 21..!


భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్‌ విమానం బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ గ్రూప్‌ కెప్టెన్‌ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ ఇండియాలోని ఓ వైమానిక స్థావరం నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా బయల్దేరిన విమానం.. కొద్దిసేపటికే ప్రమాదానికి గురై కుప్పకూలింది. ఈ ఘటనలో గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్త మృతి చెందినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ను షేర్‌ చేసింది. దీనిపై వాయుసేన కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీని ప్రారంభించింది. గత 18 నెలల్లో మిగ్‌-21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. 2019 సెప్టెంబర్లో ఇదే ఎయిర్‌ బేస్‌లో మిగ్‌21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల్లో భారత్‌ విమానాలను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్‌ పైలట్లను కూడా కోల్పోతోంది…ఈ ఘోర ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్తా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల ఐఏఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.. బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలబడతాం. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం అంటూ ట్విట్‌ చేసింది…