ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేత…

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. రెండు కేసుల్లో అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి అని తేల్చింది కోర్టు. అయితే విద్వేష పూరిత ప్రసంగం మళ్లీ చేయరాదని హెచ్చరించింది. కేసులు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేస్కోవద్దని కోర్టు స్పష్టం చేసింది. సుమారు 10 సంవత్సరాల క్రితం నమోదైన ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆధారాలు పోలీసులు సమర్పించకపోవడం వల్లే కోర్టు కేసును కొట్టేసిందని అక్బరుద్దీన్ తరపు న్యాయవాది తెలిపారు…..అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన విద్వేష వ్యాఖ్యల కేసులను నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేయడం ఊరట కలిగించింది. పాతబస్తీలో నిన్నటి నుంచే పోలీసులు భారీ సంఖ్యలో మొహరించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. ఎలాంటి పరిణామాలు ఏర్పడినా ఎదుర్కొనేలా పోలీసులు చేసిన హడావుడి ఉత్కంఠ రేపింది. ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీద్, చాంద్రాయణ గుట్ట వద్ద పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పు ఎలా వచ్చినా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాతబస్తీలో ప్రశాంతంగా ఉంది. కేసులను కొట్టేస్తూ తీర్పు రావడంతో ఉత్కంఠకు తెరపడింది…