ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ..

గుజరాత్ రాష్ట్రంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తాకింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనను నిరసిస్తూ ముస్లింలు ఆందోళనకు దిగారు. ఎంఐఎం చీఫ్ ను వెనక్కి వెళ్లాలని నల్లజెండాలు చూపారు…గుజరాత్ రాష్ట్రంలో పర్యటనకు వెళ్లిన అసుద్దీన్ ఓవైసీకి ముస్లింలు నిరసనకు దిగారు. అసదుద్దీన్ ఓవైసీని కాన్వాయ్ కు నల్లజెండాలు చూపి నిరసనకు దిగారు. అసుద్దీన్ ఓవైసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

గుజరాత్ రాష్ట్రంలో Ahmedabadలో MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనలో ముస్లింలు ఈ పర్యటనను అడ్డుకున్నారు. అహ్మదాబాద్ లో ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు అసద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసదుద్దీన్ ఓవైసీని వెనక్కి వెళ్లిపోవాలని కూడా నిరసనకారులు నినాదాలు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాాగా వేయాలని ఎంఐఎం ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పోటీ చేయాలని కూడా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేసింది. ఎంఐఎం పోటీ చేయడం వల్ల కొన్ని పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపింది. తమిళనాడు, బీహార్,ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది. యూపీ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేయడంతో ముస్లిం ఓట్లలో చీలిక వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బిజేపీ కి మద్దతు పార్టి అంటు రాజకీయ విశ్లేషకులు ముస్లింలలోని మరో వర్గం mim పై విమర్శలు గుప్పించింది..